రకం ఆధారంగా గరిష్ట ధరలు ఖరారు.. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్యం ధరల నియంత్రణకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. వివిధ రకాల సన్నబియ్యానికి గరిష్ట విక్రయ ధరలను నిర్ణయిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. నిర్ణయించిన ధరలకు మించి బియ్యం విక్రయిస్తే మిల్లర్లు, ట్రేడర్లు, రిటైల్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.పౌరసరఫరాల శాఖ నిర్ణయం ప్రకారం బీపీటీ (BPT), కేఎన్ఎం (KNM) రకం సన్నబియ్యం కిలో గరిష్ట ధర రూ.66గా నిర్ణయించారు. తెలంగాణ సోనా, ఆర్ఎన్ఆర్ (RNR) రకం బియ్యం కిలో రూ.74గా, హెచ్ఎంటీ (HMT), జేఎస్ఆర్ (JSR) రకం సన్నబియ్యం కిలో రూ.79గా ఖరారు చేశారు.
రాష్ట్రంలోని అన్ని రైస్ మిల్లులు, హోల్‌సేల్, రిటైల్ బియ్యం దుకాణాలు ఈ ధరల పరిమితిని తప్పనిసరిగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. వినియోగదారుల నుంచి అధిక ధరలు వసూలు చేయకుండా వ్యాపారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిర్ణయించిన ధరలను ఉల్లంఘించి విక్రయాలు జరిపితే తనిఖీలు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.దీంతో సన్నబియ్యం కొనుగోలు చేసే సామాన్య వినియోగదారులకు ధరల విషయంలో కొంత ఊరట లభించే అవకాశం ఉంది.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి