Sthanikam - Truth Matters
Logo

నకిరేకల్‌లో నిర్మాణంలో ఉన్న ఇళ్లే దొంగల టార్గెట్‌.. రూ.2 లక్షల విలువైన విద్యుత్‌ వైర్లు అపహరణ!

Updated : 01 Nov 2026 11:36 IST
As Preferred Source 1 min read
నకిరేకల్‌లో నిర్మాణంలో ఉన్న ఇళ్లే దొంగల టార్గెట్‌.. రూ.2 లక్షల విలువైన విద్యుత్‌ వైర్లు అపహరణ!

సంతోష్‌నగర్‌లో తెల్లవారుజామున చోరీ.. వరుస ఘటనలతో స్థానికుల్లో ఆందోళన.

నకిరేకల్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. ఇళ్ల నిర్మాణం కోసం కొనుగోలు చేసి నిల్వ ఉంచిన విలువైన సామగ్రిని అపహరిస్తూ బాధితులకు ఆర్థిక నష్టం కలిగిస్తున్నారు.

తాజాగా పట్టణంలోని సంతోష్‌నగర్‌ కాలనీలో చర్చి పక్కన నూతనంగా నిర్మిస్తున్న ఇంట్లో భారీ చోరీ జరిగింది. పెట్రోల్‌ బంక్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న ఆకుల శ్రీనివాస్‌కు చెందిన నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు చొరబడి సుమారు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల విలువైన విద్యుత్‌ వైర్లను అపహరించారు.

ఇదే తరహాలో పట్టణంలోని పలు కాలనీల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కష్టపడి ఇళ్లు నిర్మించుకుంటున్న సమయంలో విద్యుత్‌ వైర్లు, ఫర్నిచర్‌, ఇతర నిర్మాణ సామగ్రి చోరీకి గురవుతుండటంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుస ఘటనలతో కాలనీవాసుల్లో ఆందోళన నెలకొంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి