Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / మేడ్చెల్ మల్కాజ్‌గిరి

బాలల హక్కులు, పోక్సో చట్టంపై అవగాహన. సెయింట్ ఎలిజబెత్ కాన్వెంట్ హైస్కూల్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు.

Updated : 01 Nov 2026 08:03 IST
As Preferred Source 1 min read
బాలల హక్కులు, పోక్సో చట్టంపై అవగాహన.  సెయింట్ ఎలిజబెత్ కాన్వెంట్ హైస్కూల్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు.

భువనగిరి పట్టణంలోని సెయింట్ ఎలిజబెత్ కాన్వెంట్ హైస్కూల్‌లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సురక్షిత్ బచ్పన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బాలల హక్కులు, పోక్సో చట్టం–2012పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి ఎం. ఉషశ్రీ పాల్గొని విద్యార్థులకు బాలల హక్కులు, చట్టపరమైన రక్షణలు, న్యాయపరమైన అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా భువనగిరి రూరల్ సీఐ ఎన్. చంద్రబాబు మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాను జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు. న్యాయ సహాయ న్యాయవాది ఎన్. రాజశేఖర్ ఉచిత న్యాయ సహాయం, బాధితులకు అందించే పరిహారం, న్యాయ సేవల గురించి వివరించారు.

భరోసా కేంద్రం కౌన్సిలర్ పరమేశ్వరి, చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ దశరథ మాట్లాడుతూ గుడ్ టచ్–బ్యాడ్ టచ్, బాల్యవివాహాల దుష్పరిణామాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

పిల్లలు ఎలాంటి వేధింపులు, నేర పరిస్థితులు ఎదురైనా భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం అందించాలని, అవసరమైతే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ లైల, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి