Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

మునగాల పోలీస్‌స్టేషన్‌లో పటేల్ జయంతి వేడుకలు.. ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన పోలీసులు, విద్యార్థులు

Updated : 01 Nov 2026 07:02 IST
As Preferred Source 1 min read
మునగాల పోలీస్‌స్టేషన్‌లో పటేల్ జయంతి వేడుకలు.. ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన పోలీసులు, విద్యార్థులు

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని శనివారం మునగాల పోలీస్‌స్టేషన్‌లో జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో నిర్వహించిన జాతీయ ఐక్యతా వేడుకల ప్రత్యక్ష ప్రసారాన్ని సీఐ ప్రతాప్ లింగం , ఎస్‌ఐ సంజీవరెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది వీక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక యువత,వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ఐక్యత, సమగ్రత, భద్రత కోసం చేసిన విశేష కృషిని గుర్తు చేసుకున్నారు. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆయన పోషించిన పాత్రను కొనియాడారు. యువత, విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావన, ఐక్యతా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని సీఐ ప్రతాపరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, యువతకు పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి