ప్రజా సమస్యలపై కలం కదిపే జర్నలిస్టు ఆవుల మల్లికార్జునరావు నేడు తన ప్రాణాలను కాపాడుకునేందుకు దాతల సాయం కోరుతున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన ఆయన ఎనిమిదేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల గుండెకు శస్త్రచికిత్స చేయించుకోగా రూ.3 లక్షలు ఖర్చయ్యాయి. ప్రస్తుతం కిడ్నీ మార్పిడి కోసం రూ.20 లక్షలు అవసరమవుతున్నాయి.
తల్లి, భార్య, ఇద్దరు చిన్నారులకు ఆధారమైన మల్లికార్జునరావు కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. దాతలు, మానవతావాదులు స్పందించి చికిత్సకు సహాయం అందించాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
సహాయం చేయదలచిన వారు:
గూగుల్ పే: 9010201870
ఎస్‌బీఐ ఖాతా: 20070785532
ఐఎఫ్‌ఎస్‌సీ: SBIN0006315
మీ చిన్న సహాయం ఓ నిండు ప్రాణాన్ని కాపాడగలదు. మల్లికార్జునరావుకు అండగా నిలవాలని విజ్ఞప్తి.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి