Sthanikam - Truth Matters
Logo

పట్టభద్రుల ఓటు నమోదుపై బీజేపీ ప్రత్యేక కార్యక్రమం

Updated : 01 Nov 2026 11:36 IST
As Preferred Source 1 min read
పట్టభద్రుల ఓటు నమోదుపై బీజేపీ ప్రత్యేక కార్యక్రమం

అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి: నూకల వెంకటనారాయణ రెడ్డి.

నల్లగొండ జిల్లా, చిట్యాల మున్సిపల్ కేంద్రంలోని 5వ వార్డులో బీజేపీ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ చిట్యాల పట్టణ ఎమ్మెల్సీ ఓటు నమోదు కోఆర్డినేటర్ ఈడుదల మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సీనియర్ న్యాయవాది నూకల వెంకటనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్‌తో కలిసి 5వ వార్డు పరిధిలోని పట్టభద్రులను కలిసి ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు. అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటరుగా తమ పేరును నమోదు చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా నూకల వెంకటనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు. దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, రానున్న ఎన్నికల్లో పట్టభద్రులు బీజేపీ అభ్యర్థులకు మద్దతు తెలిపి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కన్నబోయిన మహాలింగ యాదవ్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు కూరెళ్ల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె వెంకన్న, జయారపు రామకృష్ణ బీజేపీ నాయకులు గోషిక వెంకటేశం, కంచర్ల శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పట్టభద్రుల ఓటు నమోదుపై బీజేపీ ప్రత్యేక కార్యక్రమం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news