చిట్యాల: తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంద వేణుగోపాల్ రెడ్డిని సోమవారం చిట్యాల పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఎలాంటి కారణం లేకుండా ముందస్తు అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఎలాంటి కార్యాచరణ ప్రకటించలేదని ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేయడం సరికాదని విమర్శించారు. ఉద్యమకారుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును మార్చుకోవాలని, ఇలాంటి చర్యలు మంచి పద్ధతి కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి