పొలం దున్నుతుండగా ప్రమాదం.. కుటుంబంలో విషాదం.
నల్గొండ: వ్యవసాయ పనులు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన నల్గొండ మండల పరిధిలోని కూతురుగూడెం గ్రామ శివారులో చోటుచేసుకుంది.
నర్సింగ్‌భట్ల గ్రామానికి చెందిన కానూగు (మొర్రి) లింగయ్య (50) తన వ్యవసాయ భూమిలో పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడ్డాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది.
కుటుంబ పెద్దను కోల్పోవడంతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో నర్సింగ్‌భట్ల, కూతురుగూడెం గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి