Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

కులవివక్ష లేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి!

Updated : 06 Nov 2026 07:20 IST
As Preferred Source 1 min read
కులవివక్ష లేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి!

అంబేద్కర్ ఆశయాల సాధనకు సమష్టిగా ముందుకు సాగాలి.

– అప్పాల ప్రసాద్

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశించిన కులవివక్ష లేని సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సామాజిక సమరసతా వేదిక సాంస్కృతిక విభాగం అఖిల భారత కార్యదర్శి, తెలంగాణ ప్రాంత కన్వీనర్ అప్పాల ప్రసాద్ పిలుపునిచ్చారు. సంత్ రవిదాస్ 650వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలేరు పట్టణంలోని శ్రీ రామకృష్ణ విద్యాలయంలో ఆలేరు, పరిసర గ్రామాల గ్రామ పెద్దల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సమాజ ఐక్యత, సామాజిక సమరసత ఆవశ్యకతపై ప్రసంగించారు.

ఈ సందర్భంగా అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రపంచానికి జ్ఞానాన్ని పంచిన విశ్వగురువు, ఆకలితో అలమటించిన దేశాలకు అన్నం పెట్టిన అన్నపూర్ణ మన భారతమాత అని కొనియాడారు. భారతీయ సమాజంలో సోదరభావంతో కలిసి జీవించే సంప్రదాయం ఉందని, విదేశీ పాలకులు అనుసరించిన విభజించి పాలించు విధానాల వల్ల సమాజంలో కులాల మధ్య విభేదాలు పెరిగాయని పేర్కొన్నారు.

గతంలో జరిగిన పరిణామాలను పక్కనపెట్టి కులాలకు అతీతంగా భారతీయులంతా ఐక్యంగా జీవించాలని పిలుపునిచ్చారు. అన్ని కులాల వారు పరస్పర సహకారం, ప్రేమాభిమానాలతో ముందుకు సాగాలని సూచించారు. సుమారు 650 ఏళ్ల క్రితం జన్మించిన సంత్ రవిదాస్ చూపిన సమానత్వ మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు.

అందరికీ సమాన హక్కులు.. సమాన గౌరవం

సమాజంలో ఎలాంటి వివక్షకు తావులేకుండా ప్రతి ఒక్కరికీ సమాన గౌరవం దక్కాలని అప్పాల ప్రసాద్ ఆకాంక్షించారు. అన్ని కులాల వారికి దేవాలయాల్లో ప్రవేశం ఉండాలని, అందరికీ ఒకే స్మశానవాటిక ఉండాలని పేర్కొన్నారు. సామాజిక ఐక్యతను బలోపేతం చేస్తూ భారతదేశ ప్రాచీన వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే బాధ్యత గ్రామ పెద్దలు, కుల పెద్దలపై ఉందన్నారు. సమాజంలో సమానత్వం, సోదరభావం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కోరారు.

తెలంగాణ ప్రాంత కళా ప్రముఖ్ బండిరాజుల శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సామాజిక సమరసతా వేదిక జిల్లా కార్యదర్శి కొంతం వెంకటేశ్వర ప్రసాద్, ఆలేరు ఖండ కన్వీనర్ దూడల వెంకటేశ్, ఎస్.ఆర్. జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కమటం రమేశ్, జనగామ జిల్లా వేదిక కన్వీనర్ కీర్తి వీరేందర్, కుండె మధు, పత్తి ఆదర్శ్, తరిగొప్పుల రమేశ్, గంగదారి శివ, సింగం అనిల్, గంగదారి సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమ్మేళనానికి హాజరైన గ్రామ పెద్దలు, కుల పెద్దలను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.

Sthanikam

కులవివక్ష లేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి!

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి