Sthanikam - Truth Matters
Logo

ఒకే రోజు రెండు ప్రమాదాలు.. ఇకపై అలాంటివి జరగొద్దు

Updated : 06 Nov 2026 06:34 IST
As Preferred Source 1 min read
ఒకే రోజు రెండు ప్రమాదాలు.. ఇకపై అలాంటివి జరగొద్దు

ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నా: గోలి నరేష్.

నకిరేకల్: ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన ఘటనపై కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గోలి నరేష్ స్పందించారు. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి మరో కారు ఢీకొట్టడంతో, అది ముందు వెళ్తున్న ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొట్టిందని తెలిపారు. నకిరేకల్ నుంచి చిన్నకాపర్తికి వెళ్తుండగా కట్టంగూరు మండలం అన్నారం వద్ద ఈ ఘటన చోటుచేసుకుందని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో కారు పాక్షికంగా ధ్వంసమైందని, అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పిందని తెలిపారు.

ఒకే రోజు వరుసగా రెండు ప్రమాదాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని గోలి నరేష్ అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఇకపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అందరూ క్షేమంగా ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Sthanikam

ఒకే రోజు రెండు ప్రమాదాలు.. ఇకపై అలాంటివి జరగొద్దు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి