గుర్తుతెలియని మహిళ
హైదరాబాద్, నవంబర్ 5: స్థానికం ప్రతినిధి
సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని మహిళ మృతి చెందడం కలకలం రేపింది. పి.ఎన్.టి. కాలనీ చౌరస్తాలోని శ్రీ సాయి మిత్ర రెసిడెన్సీ అపార్ట్‌మెంట్ ముందు గురువారం సాయంత్రం 6.20 గంటల సమయంలో సుమారు 50 ఏళ్ల వయస్సున్న మహిళ అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే డయల్ 100కు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న సరూర్‌నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, అప్పటికే మహిళ మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలు ఆకుపచ్చ రంగు చీర, గోల్డ్ కలర్ బ్లౌజ్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో విచారణ చేపట్టినప్పటికీ ఆమె పేరు, చిరునామా తదితర వివరాలు తెలియరాలేదు.
ఈ ఘటనపై సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి, మృతురాలి గుర్తింపుతోపాటు మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మహిళ వివరాలు తెలిసిన వారు, ఆమె కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని సరూర్‌నగర్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి