Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:13 PM

టైగర్ కుంగ్-ఫూ కరాటే అకాడమీ బెల్ట్ టెస్ట్

15-03-2026 255 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీలోని టైగర్ కుంగ్-ఫూ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం బెల్ట్ కండక్టింగ్ టెస్ట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ పాల్గొన్నారు. అకాడమీ విద్యార్థులకు వైట్, ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, బ్లూ, పర్పుల్, బ్రౌన్, రెడ్, బ్లాక్ బెల్ట్ క్రమంలో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో విద్యార్థుల శారీరక దృఢత్వం, కిక్స్, పంచెస్, కాటా (కాటస్) ప్రదర్శనతో పాటు క్రమశిక్షణను పరీక్షించారు.5 సంవత్సరాల పైబడిన చిన్నారులకు కరాటే శిక్షణ అందిస్తున్నామని అకాడమీ నిర్వాహకులు తెలిపారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ పబ్బు శ్రీకాంత్, అకాడమీ సభ్యులు, శిక్షకులు, శిక్షణ పొందిన విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

టైగర్ కుంగ్-ఫూ కరాటే అకాడమీ బెల్ట్ టెస్ట్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News