Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నకు రాఖీ కట్టేందుకు వచ్చి.. కుమారుడిని కోల్పోయిన తల్లి! అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 05:14 PM

శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు ఘనంగా

15-02-2026 95 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

భోగి బండార్ కార్యక్రమం నిర్వహించిన సర్పంచ్ బానోతు పుష్ప రవి

గ్రామ పెద్దలు, నాయకులు, మహిళలు విశేషంగా పాల్గొనడం

గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భోగి బండార్ కార్యక్రమాన్ని సర్పంచ్ బానోతు పుష్ప రవి ఆధ్వర్యంలో నిర్వహించారు.జయంతి సందర్భంగా మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. బంజారా సంప్రదాయాల ప్రకారం భోగి బండార్ కార్యక్రమాన్ని నిర్వహించగా గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నాగేశ్వరావు, రామూర్తి, వార్డు బాలాజీ, నాయకులు గుగులోత్ లచ్చు నాయక్, బానోతు ధర్మ, వడ్తయ్య బాలకృష్ణ, సూక్య, యల్లయ్య, వీరన్న తదితరులు పాల్గొన్నారు. మహిళల్లో వడ్తయ్య రాజమ్మ, సాలమ్మా పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.సంత్ సేవాలాల్ మహారాజ్ బోధించిన సామాజిక సమానత్వం, ఐక్యత, సేవా భావం మార్గదర్శకంగా తీసుకొని ముందుకు సాగాలని వక్తలు పిలుపునిచ్చారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

Sthanikam

శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు ఘనంగా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News