Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 11:50 AM

శక్తి యాప్ పై అవగాహన కల్పిస్తున్న పోలీస్ సిబ్బంది

23-02-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

జిల్లాలో మహిళలు ,బాలికల భద్రతే ముఖ్యమని ప్రతి ఒక్కరు శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని శక్తి టీం బృందాలు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. సోమవారం 'శక్తి' యాప్ వినియోగం పై మహిళలకు, విద్యార్థినిలకు అవగాహన కల్పించారు.శక్తి' యాప్ మహిళలు, బాలికల రక్షణకు ఆపద సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుందని

శక్తి' యాప్ ఆవశ్యకత, వినియోగం గురించి తెలియజేశారు.మహిళలు , చిన్నారులపై జరిగే నేరాలు, సైబర్ మోసాల పై డయల్ 100,112, చైల్డ్ లైన్ 1098, గృహ హింస 181, మహిళ వేధింపులు 1091,సైబర్ టోల్ ఫ్రి 1930, సైబర్ మిత్ర, సంబంధిత పోలీసు వారికి తక్షణమే సంప్రదించి పోలీసు వారు అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ప్రతి మహిళ, బాలికలు సెల్ఫోన్లో ప్లే స్టోర్ నందు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని వ్యక్తిగత వివరాలు ఫోన్ నెంబర్లతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఎస్.ఓ.ఎస్ బటన్, డయల్ 112 నెంబర్ ద్వారా ఫిర్యాదు చేసిన వెంటనే పది నిమిషాల్లో మీ చెంతకు సంబంధిత పోలీస్ అధికారులు చేరుకొని మీయొక్క సమస్యను ,ఆపదను పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతామని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, 'శక్తి' టీమ్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

శక్తి యాప్ పై అవగాహన కల్పిస్తున్న పోలీస్ సిబ్బంది

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News