Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

స్థానిక పరిశ్రమల్లో నిరుద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వాలి

Updated : 23 Oct 2026 18:48 IST
As Preferred Source 1 min read
స్థానిక పరిశ్రమల్లో నిరుద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వాలి

కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల ఉద్యోగాల హామీని నిలబెట్టుకోవాలి

సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బూరుగు కృష్ణారెడ్డి

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

మండల పరిధిలోని పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగ యువతీ యువకులకు ప్రాధాన్యమిస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం కందాల రంగారెడ్డి స్మారక భవనంలో సీపీఎం మండల కార్యదర్శివర్గ సభ్యుడు చీరిక సంజీవరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

​మండలంలో అనేక పరిశ్రమలు నెలకొల్పినప్పటికీ స్థానిక యువతకు తగిన స్థాయిలో ఉద్యోగాలు లభించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా పరిశ్రమలు ఉన్నప్పుడు ఆ ప్రాంత వాసులకు ఉపాధి కల్పిస్తేనే వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, పరిశ్రమల యాజమాన్యాలతో చర్చించి స్థానికులకు ఉద్యోగాలు దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక యువతకు న్యాయం జరిగే వరకు సీపీఎం ఆధ్వర్యంలో నిరంతరం పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు.​ఈ సమావేశంలో సీపీఎం మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, జిల్లా కమిటీ సభ్యుడు రాగిరి కిష్టయ్య, మండల కార్యదర్శివర్గ సభ్యుడు చింతల సుదర్శన్, మండల కమిటీ సభ్యులు అంతటి అశోక్, ఆదిమూలం నందీశ్వర్, పొట్ట శ్రీనివాస్, ఎనమల్ల సంజీవ, మీసాల శీను తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

స్థానిక పరిశ్రమల్లో నిరుద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వాలి

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి