సరూర్‌నగర్ చెరువు కట్ట పరిసరాల్లో ఒక ఆంజనేయ స్వామి విగ్రహం లభ్యమైంది. సోమవారం చెరువు కట్టపై కొంతమంది నడుచుకుంటూ వెళ్తుండగా ఈ విగ్రహం కనిపించింది. చెరువు కట్టపై ఆంజనేయ స్వామి విగ్రహం దొరికిందనే వార్త తెలియడంతో స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. భక్తులందరూ కలిసి స్వామివారి విగ్రహానికి పాలాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు ఇచ్చారు. పవిత్రమైన కార్తీక మాసంలో సరూర్‌నగర్ చెరువు కట్టపై ఇలా ఆంజనేయ స్వామి విగ్రహం లభించడం ఎంతో శుభపరిణామమని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సరూర్‌నగర్ చెరువు కట్టపై ఆంజనేయ స్వామి విగ్రహం లభ్యం
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి