అనంతగిరి మండలం కొత్తగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూక్యా బాబు కుమారుడు లీలా ప్రసాద్ ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి సోమవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే లీలా ప్రసాద్ అకాల మరణం చెందడం బాధాకరమని,కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతమని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని కోరుతూ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.లీలా ప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
లీలా ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి