సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రీయ ఏక్తా దివస్ మరియు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో జాతీయ సమైక్యత పరుగు (Run for Unity) కార్యక్రమాన్ని నిర్వహించారు.
జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, ఐపీఎస్ తొలుత సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం జాతీయ ఐక్యతను చాటిచెప్పేలా నిర్వహించిన ‘రన్ ఫర్ యూనిటీ’ పరుగును జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ
మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రత, అంతర్గత భద్రతను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యతని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరూ ఐకమత్యంతో ముందుకు సాగుతూ జాతీయ సమైక్యతా స్ఫూర్తిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.
భారతదేశ సమైక్యత, సమగ్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన అపార సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఏవో వేణుగోపాల్, సూపరింటెండెంట్ సరస్వతి, ఆర్‌ఐ వలి, ఆర్‌ఎస్‌ఐ ప్రసాద్ ఏఆర్ సిబ్బంది, కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి