అర్నాబ్ తుఫాన్‌తో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని రైతు సంఘం రాష్ట్ర నాయకులు బుర్రి శ్రీరాములు డిమాండ్ చేశారు.
శుక్రవారం రైతు సంఘం ఆధ్వర్యంలో మునగాల మండలంలో తుఫాన్‌కు నేలకొరిగిన వరి పంట పొలాలను నాయకులు పరిశీలించారు.అనంతరం తహసీల్దార్ సరితకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా బుర్రి శ్రీరాములు మాట్లాడుతూ.. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులతో పంటలు దెబ్బతిని రైతులు ఇబ్బందులు పడుతుండగా, తాజాగా తుఫాన్ కారణంగా చేతికొచ్చిన వరి పంట నేలకొరిగి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. అధికారులు వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి వరి, పత్తి తదితర పంటలకు ఎకరాకు రూ.25 వేల పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షులు చంద్రయ్య, కార్యదర్శి స్టాలిన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ సైదా, జూలకంటి విజయలక్ష్మి, బచ్చలకూర స్వరాజ్యం, నందిగామ సైదులు, కృష్ణారెడ్డి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి