Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

పాదచారుల మార్గాలను ఆక్రమిస్తే ఉపేక్షించం

Updated : 31 Oct 2026 07:02 IST
As Preferred Source 1 min read
పాదచారుల మార్గాలను ఆక్రమిస్తే ఉపేక్షించం

కోదాడ పట్టణంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేలా రహదారుల వెంట ఫుట్‌పాత్‌లను ఆక్రమించి డబ్బాలు, ప్రకటన బోర్డులు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కోదాడ ట్రాఫిక్ ఎస్సై అంజిరెడ్డి హెచ్చరించారు.ఈ మేరకు శుక్రవారం కోదాడ పట్టణంలోని మెయిన్‌రోడ్డు వెంబడి ఫుట్‌పాత్‌లపై ఏర్పాటు చేసిన అక్రమ ఆక్రమణలను ప్రోక్లైన్‌ సహాయంతో తొలగించారు. ఫుట్‌పాత్‌లు ప్రజల నడక కోసం మాత్రమేనని, వాటిని వ్యాపార అవసరాలకు వినియోగించరాదని సూచించారు.వ్యాపార సంస్థల యజమానులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, రహదారులపై వాహనాల రాకపోకలకు, పాదచారుల నడకకు ఎలాంటి ఆటంకాలు కలిగించవద్దని ఎస్సై అంజిరెడ్డి తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Sthanikam

పాదచారుల మార్గాలను ఆక్రమిస్తే ఉపేక్షించం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి