మునగాల మండల పరిధిలోని కలకోవ గ్రామంలో కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా కోతుల గుంపు దాడి చేయడంతో గ్రామానికి చెందిన బచ్చు లింగమ్మ అనే వృద్ధురాలు శుక్రవారం తీవ్రంగా గాయపడింది.ఇంటి వద్ద ఉన్న సమయంలో ఒక్కసారిగా కోతుల గుంపు ఆమెపై దాడి చేయడంతో గాయాలయ్యాయి.వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ కోతుల సంచారం పెరిగిందని, పంటలను నాశనం చేయడంతో పాటు ఇళ్లలోకి చొరబడి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా గ్రామంలో కోతుల బెడదను అరికట్టేందుకు కలకోవా సర్పంచ్ మండవ వెంకటాద్రి, సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కలకోవలో వృద్ధురాలిపై కోతుల దాడి.. తీవ్ర గాయాలు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి