Sthanikam - Truth Matters
Logo

నిత్యావసర ధరలను నియంత్రించాలి. రేషన్‌ షాపుల ద్వారా 14 రకాల సరుకులు పంపిణీ చేయాలి: మల్లు లక్ష్మి.

Updated : 30 Oct 2026 21:04 IST
As Preferred Source 1 min read
నిత్యావసర ధరలను నియంత్రించాలి. రేషన్‌ షాపుల ద్వారా 14 రకాల సరుకులు పంపిణీ చేయాలి: మల్లు లక్ష్మి.

నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించాలని ఐద్వా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రేషన్‌ షాపుల ద్వారా బియ్యంతో పాటు 14 రకాల నిత్యావసర వస్తువులను సబ్సిడీ ధరలకు పంపిణీ చేయాలని కోరారు.

శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో తుమ్మల పద్మ అధ్యక్షతన నిర్వహించిన ఐద్వా జిల్లా కమిటీ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. కనీస వేతనాలు పెరగకపోవడం, ఉపాధి అవకాశాలు తగ్గడం వల్ల కుటుంబ పోషణ భారంగా మారిందని పేర్కొన్నారు. బియ్యం, పప్పులు, వంటనూనె, ఉల్లిగడ్డల ధరలు పెరగడంతో పేదలు పౌష్టికాహారానికి దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (2019–21) ప్రకారం దేశంలో 15–49 ఏళ్ల మహిళల్లో 57 శాతం, తెలంగాణలో 57.6 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని తెలిపారు. మహిళలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. 2025 గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 123 దేశాల్లో భారత్ 102వ స్థానంలో ఉండటం ఆహార భద్రతపై ఆందోళన కలిగిస్తోందన్నారు.

ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ రేషన్‌ షాపుల ద్వారా కందిపప్పు, పెసరపప్పు, వంటనూనె, చక్కెర, గోధుమలు, గోధుమపిండి, ఉల్లిగడ్డలు, చింతపండు తదితర 14 రకాల సరుకులను సబ్సిడీ ధరలకు అందించాలని కోరారు. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలని, కనీస వేతనాలు పెంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండ అనురాధ, కారంపూడి ధనలక్ష్మి, పాతూరి గోవర్ధన, సుల్తానా, కనుకుంట్ల ఉమారాణి, కౌసల్య, బొల్లెపల్లి మంజుల తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి