Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

బాలికల ఆరోగ్యం కోసం వైద్య, మహిళా సంక్షేమ శాఖల సంయుక్త కార్యక్రమం

Updated : 30 Oct 2026 18:05 IST
As Preferred Source 1 min read
బాలికల ఆరోగ్యం కోసం వైద్య, మహిళా సంక్షేమ శాఖల సంయుక్త కార్యక్రమం

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, మానూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో భేటీ బచావో – భేటీ పడావో కార్యక్రమంలో భాగంగా బాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్యం, విద్య, హక్కులు, సాధికారతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు రక్తహీనత వల్ల కలిగే సమస్యలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ నారాయణఖేడ్ ప్రాజెక్టు సీడీపీఓ ఎల్. సుజాత మాట్లాడుతూ బాలికలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మానూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ స్టాలిన్ రక్తహీనత వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. జిల్లా మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త గడ్డం పల్లవి మాట్లాడుతూ బాలికల హక్కులు, విద్య ప్రాముఖ్యత, సురక్షితమైన స్పర్శ, అసురక్షితమైన స్పర్శ, రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. బాలికలు తమ హక్కులను తెలుసుకొని, ఆత్మవిశ్వాసంతో చదువులో రాణిస్తూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వైద్యనాథ్, సీహెచ్‌ఓ ప్రభాకర్, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆర్థిక నిపుణులు పి. నర్సింలు, ఏఎన్‌ఎంలు,ఆరోగ్య పర్యవేక్షకులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బాలికల ఆరోగ్యం కోసం వైద్య, మహిళా సంక్షేమ శాఖల సంయుక్త కార్యక్రమం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి