Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / రంగారెడ్డి

ప్రభుత్వ భూములు ప్రజా ప్రయోజనాలకే వినియోగిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

Updated : 30 Oct 2026 17:53 IST
As Preferred Source 1 min read
ప్రభుత్వ భూములు ప్రజా ప్రయోజనాలకే వినియోగిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా మియాపూర్‌లోని సర్వే నంబర్లు 100, 101 పరిధిలో ఉన్న 550 ఎకరాల భూమిపై పూర్తి హక్కులు ప్రభుత్వానికే చెందుతాయని సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించడం తెలంగాణకు కీలక పరిణామమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దాదాపు రూ.50 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి పార్లమెంట్ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి రక్షించేందుకు ప్రభుత్వం న్యాయపోరాటం చేస్తోందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు దాదాపు రూ.1.50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడినట్లు వెల్లడించారు. మియాపూర్‌లోని 550 ఎకరాలతో పాటు కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాలు, మామిడిపల్లిలో 450 ఎకరాలు, సాహెబ్‌నగర్ కలాన్‌లో 140 ఎకరాలు, కొండాపూర్‌లో 36 ఎకరాలు, మంచిరేవులలో 143 ఎకరాలు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని అటవీ భూములను న్యాయపోరాటం ద్వారా కాపాడినట్లు వివరించారు. ప్రభుత్వ భూములను కబ్జాలకు గురికాకుండా రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, కాపాడిన భూములను ప్రజా ప్రయోజనాల కోసం వినియోగిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా పేదలు, దళితులు, గిరిజనుల అభివృద్ధి, నిరుపేదలకు విద్య, ఇందిరమ్మ ఇళ్లు, సాగునీటి ప్రాజెక్టులు, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు ఈ భూముల ద్వారా వచ్చే నిధులను వినియోగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అటవీ శాఖకు సంబంధించిన భూములను ఆ శాఖకు, రెవెన్యూ శాఖకు సంబంధించిన భూములను ఆ శాఖకు అప్పగిస్తామని చెప్పారు. భూముల వినియోగం, వాటి ద్వారా చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ భూములను కాపాడటమే కాకుండా వాటిని ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

Sthanikam

ప్రభుత్వ భూములు ప్రజా ప్రయోజనాలకే వినియోగిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి