ఎల్‌నినోను సమిష్టిగా తరిమికొడదాం: చైర్పర్సన్ పావని రమేష్ గౌడ్
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావం వల్ల తలెత్తే తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ముందస్తు చర్యగా రూ. 85 లక్షలు కేటాయిస్తున్నట్లు చౌటుప్పల్ పురపాలక సంఘం చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ తెలిపారు. శుక్రవారం స్థానిక పురపాలక సంఘం కౌన్సిల్ హాల్లో ఆమె అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రాబోయే వేసవి కాలంలో తాగునీటి సమస్య రాకుండా చూసేందుకు ప్రాధాన్యత క్రమంలో కొత్త బోర్లు వేయడం, మోటార్లు, పైప్లైన్ల ఏర్పాటు, ప్రైవేటు బోర్ల లీజు, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు.పట్టణంలోని వివిధ వార్డులలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణం, ఊర చెరువు పూడికతీత వంటి అభివృద్ధి పనులకు రూ. 1.06 కోట్లు, సాధారణ పరిపాలన, నిర్వహణ అవసరాల కోసం రూ. 28.27 లక్షలు కేటాయించామని, మొత్తంగా రూ. 2.28 కోట్ల నిధుల వ్యయానికి కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు వివరించారు.ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర నాయక్, వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్, కౌన్సిలర్లు కోసనం రాకేష్ రెడ్డి, పాలేపల్లి లక్ష్మి, పల్లె లావణ్య, ఉదరి యాదయ్య, కొయ్యడ శేఖర్, ఆలే శైలజ, కాసర్ల మంజుల, బద్రి గాలయ్య, దేప రమ్య, పాక చిరంజీవి, బత్తుల వాణి, ఉడుగు జ్యోతి, గడ్డం ఇందిర, బత్తుల జయమ్మ, చింతల ఉమామహేశ్వరి, బుడ్డ సురేష్, పిల్లలమర్రి మధుసూదన్, హనుమ మహమ్మద్, కో-ఆప్షన్ సభ్యులు పస్తం గంగారాములు, సందగట్ల విజయ, షేక్ సబీనా, అధికారులు డాక్టర్ డి. చంద్రశేఖర్ (ఆర్ఎంఓ), ఎం. గోవర్ధన్ (ఎఫ్ఎస్ఓ), బి. నవీన్ (ఏఈఈ, ఆర్,బి), జి. శ్రీలక్ష్మి (ఏఈఈ, ఐ,సిఏడీడీ), ఇ. గురువారావు (ఎంఈఓ), లక్ష్మీనారాయణ (ఈఈ, మిషన్ భగీరథ) తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి