Sthanikam - Truth Matters
Logo

20 ఏళ్ల యువతికి బ్రెయిన్ స్ట్రోక్‌.. యశోదా వైద్యులతో తప్పిన ప్రాణాపాయం

Updated : 30 Oct 2026 17:53 IST
As Preferred Source 1 min read
20 ఏళ్ల యువతికి బ్రెయిన్ స్ట్రోక్‌.. యశోదా వైద్యులతో తప్పిన ప్రాణాపాయం

అత్యాధునిక చికిత్సతో కోలుకున్న యువతి.. సమయానుకూల వైద్యంతో ప్రాణరక్షణ

నల్గొండ: సాధారణంగా వృద్ధాప్యంలో కనిపించే బ్రెయిన్ స్ట్రోక్‌ 20 ఏళ్ల యువతిని తీవ్ర అస్వస్థతకు గురిచేసింది. అకస్మాత్తుగా మాట పడిపోవడంతోపాటు కుడిచేయి, కుడికాలు చచ్చుబడటంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని మలక్‌పేట యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అధునాతన చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి కాపాడారు.

పరీక్షల్లో మెదడులో ఎడమవైపు తీవ్రమైన ఇస్కీమిక్ స్ట్రోక్‌ వచ్చినట్లు గుర్తించారు. రక్తంలో పొటాషియం స్థాయులు తీవ్రంగా పడిపోవడం, అధిక రక్తపోటు, సోడియం స్థాయుల్లో హెచ్చుతగ్గులతో కేసు సంక్లిష్టంగా మారింది. న్యూరో ఐసీయూలో ఉంచి న్యూరాలజీ, న్యూరోసర్జరీ, క్రిటికల్ కేర్, నెఫ్రాలజీ, ఎండోక్రైనాలజీ నిపుణులు సమన్వయంతో చికిత్స అందించారు. శస్త్రచికిత్స అవసరం లేకుండానే మందులతో యువతి కోలుకుంది.

నల్గొండ పట్టణంలోని శాలిని రెస్టారెంట్‌లో యశోదా ఆసుపత్రి యాజమాన్యం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కన్సల్టెంట్ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ సూరిశెట్టి భరత్ కుమార్, ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ జయాదిత్య ఘోష్, న్యూరోసర్జన్ డాక్టర్ బి. గేయానంద్ సుధీర్ చికిత్స వివరాలను వెల్లడించారు. ఆసుపత్రి అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిదుర మాట్లాడుతూ యువతి ఆరోగ్యం మెరుగుపడటంతో డిశ్చార్జి చేసినట్లు తెలిపారు. శరీరంలో ఒకవైపు అకస్మాత్తుగా బలహీనత, మాట తడబడటం వంటి లక్షణాలు కనిపిస్తే వయసుతో సంబంధం లేకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.

Sthanikam

20 ఏళ్ల యువతికి బ్రెయిన్ స్ట్రోక్‌.. యశోదా వైద్యులతో తప్పిన ప్రాణాపాయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి