Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

అక్రమ మద్యం దందాపై ఖాకీల పంజా!

Updated : 30 Oct 2026 17:53 IST
As Preferred Source 1 min read
అక్రమ మద్యం దందాపై ఖాకీల పంజా!

తంగడపల్లిలో ఇల్లు పై దాడి.. 15 బీరు బాటిళ్లు జప్తు

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

మండల పరిధిలోని తంగడపల్లి గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న మద్యం విక్రయాలపై పోలీసులు దాడి చేసి 15 బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. చౌటుప్పల్ ఇన్ స్పెక్టర్ డి.సతీష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... పెట్రో మొబైల్-1 విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ వి.శ్రీనివాస్ (హెచ్‌సీ 1843)కు తంగడపల్లి గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు నమ్మదగిన సమాచారం అందింది.​ఈ మేరకు శుక్రవారం తంగడపల్లికి చెందిన రాచకొండ సుజాత (34) ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విక్రయానికి సిద్ధంగా ఉంచిన 15 'కె.ఎఫ్. లైట్' బీరు బాటిళ్లు లభించగా, వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న సదరు మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ సతీష్ రెడ్డి తెలిపారు.

Sthanikam

అక్రమ మద్యం దందాపై ఖాకీల పంజా!

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి