సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలోని హనుమాన్ మందిరం 3వ వార్షికోత్సవ వేడుకలను శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకుల వేదమంత్రాల నడుమ స్వామివారికి ప్రత్యేక అభిషేకం, చందన అలంకరణ, పూజలు, హోమం నిర్వహించి మహాహారతి సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. గురువారం రాత్రి వివిధ గ్రామాల భజన మండళ్ల ఆధ్వర్యంలో భక్తి గీతాలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.
రాయికోడ్‌లో ఘనంగా హనుమాన్ జయంతి తరహాలో వార్షికోత్సవ వేడుకలు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి