Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / జహీరాబాద్

ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అభినందనీయం

Updated : 30 Oct 2026 18:26 IST
As Preferred Source 1 min read
ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అభినందనీయం

జహీరాబాద్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తున్న సూపరింటెండెంట్ డాక్టర్ మల్లికార్జున్‌ను నవనిర్మాణ ప్రజా సమితి నాయకులు ఘనంగా సన్మానించారు. శుక్రవారం సమితి అధ్యక్షుడు మొహమ్మద్ అల్లావుద్దీన్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ మల్లికార్జున్, ఆర్ఎంఓ డాక్టర్ మానస, అడిషనల్ ఆర్ఎంఓలకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి సత్కరించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు మెరుగైన వైద్యం, అత్యవసర సమయాల్లో తక్షణ సేవలు అందించడం అభినందనీయమని కొనియాడారు. వైద్యులు, సిబ్బంది సేవలతో ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రిపై నమ్మకం పెరుగుతోందని హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ ఇదే సేవాభావంతో పనిచేస్తూ ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నవనిర్మాణ ప్రజా సమితి నాయకులు, సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అభినందనీయం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి