దశదినకర్మలో పరామర్శించిన భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు శాగ చంద్రశేఖర్ రెడ్డి
బాధిత కుటుంబానికి రూ. 20 వేల నగదు అందజేత
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
మండల పరిధిలోని పంతంగి గ్రామానికి చెందిన రోడ్డ కిష్టయ్య ఇటీవల మరణించగా, ఆయన దశదినకర్మ సందర్భంగా భాజపా నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. శుక్రవారం పంతంగిలో నిర్వహించిన కార్యక్రమంలో భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు శాగ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని కిష్టయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబానికి రూ. 20,000 ఆర్థిక సాయాన్ని అందజేసి అండగా నిలిచారు.ఈ సందర్భంగా శాగ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. మృతుడు కిష్టయ్య గతంలో గ్రామపంచాయతీ సిబ్బందిగా గ్రామ ప్రజలకు విశేష సేవలు అందించారని కొనియాడారు. ఈ కష్టసమయంలో వారి కుటుంబానికి భాజపా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పంతంగి వార్డు సభ్యులు బండ శేఖర్, బొమ్మని రాజశేఖర్, బూత్ అధ్యక్షులు మిరియాల సంతోష్, నాటి శివ, తోర్పునూరి దయాకర్, మార్గం వెంకటేష్, పార్టీ నాయకులు రేఖ జంగయ్య, మిర్యాల రవి, రవి చారి, సురేష్, నాటి సాయి, బాతరాజు సాయి, అంతటి రాజేష్, మార్గం నరేష్, దూడల నితీష్, ఆనగంటి దీపక్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి