ఎరుకల సామాజిక వర్గానికి ఏకలవ్య కార్పొరేషన్ చైర్మన్‌ను వెంటనే నియమించాలని, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవిని ఎరుకల వారికి కేటాయించాలని తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భువనగిరిలో సంఘం జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూతాడి సురేష్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎరుకల ప్రజలకు విద్య, ఉద్యోగాలు, ఉపాధి, ఇళ్ల స్థలాలు, సంక్షేమ పథకాల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు. సామాజిక వర్గ అభివృద్ధికి ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏకలవ్య కార్పొరేషన్ చైర్మన్‌ను వెంటనే ప్రకటించకపోతే ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో కూతాడి యాదగిరి, నల్లగొండ వీరన్న, కూరాకుల విజయకుమార్, ఉండ్రాతి రవి, మాదగాని నరేష్ తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి