Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి.

Updated : 30 Oct 2026 16:55 IST
As Preferred Source 1 min read
పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి.

గతంలో ఓటు ఉన్నవారు సైతం మళ్లీ నమోదు చేసుకోవాలి.

కాంగ్రెస్‌ నాయకుడు బొడ్డు సురేందర్‌రావు.

రామన్నపేట అక్టోబర్‌ 30 స్థానికం ప్రతినిధి:

నల్లగొండ–వరంగల్‌–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులందరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకులు, రిటైర్డ్‌ ఐబీ ఈఈ బొడ్డు సురేందర్‌రావు (సాలయ్య) కోరారు. శుక్రవారం రామన్నపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కొత్త ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతోందని, ఎన్నికల సంఘం పాత ఓటరు జాబితాను రద్దు చేసినందున గతంలో ఓటు హక్కు ఉన్నవారు కూడా మళ్లీ కొత్తగా నమోదు చేసుకోవాలని సూచించారు. పట్టభద్రులు ఓటు నమోదు విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని అన్నారు.యువత, ఉద్యోగులు, విద్యార్థుల సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించడంతోపాటు వాటి పరిష్కారానికి కృషి చేయడంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ పాత్ర కీలకమని పేర్కొన్నారు. డిగ్రీ, ఇంజినీరింగ్‌ లేదా తత్సమాన విద్యార్హత పూర్తి చేసి 2023 అక్టోబర్‌ 31 నాటికి మూడేళ్లు పూర్తయిన వారు ఓటరు నమోదుకు అర్హులని తెలిపారు. నవంబర్‌ 6 చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కోరారు.కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రామన్నపేట మండల కేంద్రంలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతోందని, అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బొడ్డు సురేందర్‌రావు సూచించారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి.

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి