అఖిల భారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సీపీఎం మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు పిలుపునిచ్చారు.
శుక్రవారం మునగాల మండల కేంద్రంలోని సుందరయ్య భవనంలో చందా చంద్రయ్య అధ్యక్షతన జరిగిన సీపీఎం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..నవంబర్ 15, 16, 17, 18 తేదీల్లో నల్గొండలో రైతు సంఘం జాతీయ మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రకు నిలయమైన మునగాల పరగణం నుంచి ఈ మహాసభలకు రైతు సంఘం ఆధ్వర్యంలో రెండు వేల మంది రైతులను సమీకరించాలని పిలుపునిచ్చారు.నవంబర్ 5 నుంచి డప్పు కళాకారులు, కోలాట బృందాలు, కళాకారులతో గ్రామగ్రామాన ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, మండలంలోని అన్ని గ్రామాల్లో ఐదు వేల రైతు కుటుంబాలను కలిసి మహాసభల ప్రాధాన్యతను వివరించాలని అన్నారు.మహాసభల విజయవంతానికి మునగాల మండలం నుంచి పెద్ద ఎత్తున రైతులు పాల్గొనేలా కృషి చేయాలని కోరారు.ఈ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జూలకంటివిజయలక్ష్మి షేక్ సైద బచ్చలకూరి స్వరాజ్యం మండల కమిటీ సభ్యులు మండవ వెంకటాద్రి స్టాలిన్ రెడ్డి జ్యోతి సైదులు మల్లరెడ్డి రమేష్ కృష్ణారెడ్డి బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి