Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

సైకిల్‌పై సందేశం.. యువతలో మార్పు కోసం విజయలక్ష్మి సంకల్పం

Updated : 31 Oct 2026 07:02 IST
As Preferred Source 1 min read
సైకిల్‌పై సందేశం.. యువతలో మార్పు కోసం విజయలక్ష్మి సంకల్పం

మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా చేపట్టిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ జాతీయ సైకిల్ యాత్రలో భాగంగా శ్రీమతి ఐ. విజయలక్ష్మి శుక్రవారం కోదాడలోని కిట్స్ మహిళా ఇంజినీరింగ్ కళాశాలను సందర్శించారు.ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ, విద్యార్థినులు, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటి వినియోగం వల్ల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తు దెబ్బతింటాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.భీమవరం నుంచి న్యూఢిల్లీ వరకు కొనసాగుతున్న ఈ సైకిల్ యాత్ర అక్టోబర్ 29 నుంచి నవంబర్ 15 వరకు తెలంగాణలోని వివిధ జిల్లాల మీదుగా సాగనుంది.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్లపల్లి గాంధీ మాట్లాడుతూ..62 ఏళ్ల వయసులో విజయలక్ష్మి చేపట్టిన సైకిల్ యాత్ర అభినందనీయమని అన్నారు. కోదాడ పట్టణ ఎస్‌ఐ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థినులు ఆమెను ఆదర్శంగా తీసుకొని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విభాగాధిపతులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

Sthanikam

సైకిల్‌పై సందేశం.. యువతలో మార్పు కోసం విజయలక్ష్మి సంకల్పం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి