మోడల్ పాఠశాల ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయుల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన ఐదు రోజుల ఉద్యమంలో భాగంగా శుక్రవారం మునగాల తెలంగాణ మోడల్ పాఠశాలలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరూ మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసన తెలిపారు. మోడల్ పాఠశాల ఉపాధ్యాయులకు ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 010 పద్దు ద్వారా నెలవారీ వేతనాలు చెల్లించాలని, మరణించిన ఉపాధ్యాయుల అర్హులైన కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే సర్వీసు నిబంధనల ప్రకారం పదోన్నతులు కల్పించాలని, అర్హులైన టి.జి.టి ఉపాధ్యాయులకు కాల్పనిక ప్రయోజనాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యలను ప్రభుత్వం గుర్తించి తక్షణమే పరిష్కరించాలని ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేశారు.ఐదు రోజుల ఉద్యమ కార్యాచరణలో భాగంగా తదుపరి దశల్లో మండల,జిల్లా స్థాయిల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించి ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మునగాల తెలంగాణ మోడల్ పాఠశాల ఉపాధ్యాయులందరూ ఐక్యంగా పాల్గొన్నారు.
మోడల్ పాఠశాల ఉపాధ్యాయుల హక్కుల సాధనకు ఉద్యమ బాట
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి