Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

కార్మిక హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి. ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవంలో జిల్లా అధ్యక్షుడు బొలగాని సత్యనారాయణ.

Updated : 31 Oct 2026 12:09 IST
As Preferred Source 1 min read
కార్మిక హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి.  ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవంలో జిల్లా అధ్యక్షుడు బొలగాని సత్యనారాయణ.

మోటకొండూరు: కార్మికుల హక్కుల పరిరక్షణకు సంఘటిత పోరాటాలే మార్గమని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బొలగాని సత్యనారాయణ అన్నారు. ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం మోటకొండూరు మండల కేంద్రంలో సంఘం జెండాను బొలగాని సత్యనారాయణ, బీరకాయల మల్లేష్ ఆవిష్కరించారు. బోళ్ల శీను అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సత్యనారాయణ మాట్లాడుతూ.. భారత కార్మిక ఉద్యమ చరిత్రలో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ)కి ప్రత్యేక స్థానం ఉందన్నారు.

దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఏఐటీయూసీ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. కార్మికులు ఎదుర్కొంటున్న సుదీర్ఘ పని గంటలు, తక్కువ వేతనాలు, ప్రమాదకర పని పరిస్థితులు, కనీస సౌకర్యాల కొరత వంటి సమస్యలపై సంఘటితంగా పోరాటాలు నిర్వహించిన ఘనత ఏఐటీయూసీకి ఉందన్నారు. 1920 అక్టోబర్ 31న బొంబాయి నగరంలో ఏఐటీయూసీ ఆవిర్భవించిందని, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజపతిరాయ్ తొలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని గుర్తుచేశారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్మిక హక్కులను కాలరాసే విధానాలను వ్యతిరేకిస్తూ కార్మికులంతా ఐక్యంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల గౌరవ అధ్యక్షుడు గాదెగాని మాణిక్యం, నాయకులు బోళ్ల శ్రీనివాస్, ఆలేటి బాలరాజు, జూలికపల్లి పాండు, బీరకాయల మధు, గొట్టిపాముల సునీల్ కుమార్, బోట్ల యాదయ్య, కచ్చిగళ్ల భాష, ఎత్తర యాదగిరి, శేఖర్, నవీన్, కట్ల శ్రీనివాస్, కొరుటూరు నరసింహ, కుమ్మరి నరసింహ, బాల్ద వెంకటేష్, మర్రి కుక్కల మహేష్, ఆంబోజ రాములు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి