Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యం.. యువతకు ప్రిన్సిపాల్‌ జగదీశ్‌ పిలుపు!

Updated : 31 Oct 2026 15:03 IST
As Preferred Source 1 min read
డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యం.. యువతకు ప్రిన్సిపాల్‌ జగదీశ్‌ పిలుపు!

యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడటంతో పాటు, డ్రగ్స్‌ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రామన్నపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆధ్వర్యంలో శనివారం ‘నషా ముక్త్‌ భారత్‌’ కార్యక్రమంలో భాగంగా మినీ మారథాన్‌ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ సి. జగదీశ్‌ జెండా ఊపి మారథాన్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం యువత ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా కుటుంబాలను ఆర్థికంగా, సామాజికంగా కుంగదీస్తుందని అన్నారు. డ్రగ్స్‌ యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసే మహమ్మారి అని పేర్కొన్నారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ, ఇతరులకు కూడా వాటి దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని సూచించారు.కళాశాల ఆవరణ నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం వరకు మారథాన్‌ కొనసాగింది. ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు, అధ్యాపకులు, పోలీస్‌ సిబ్బంది, స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులతో ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు.

కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్లు అశోక్‌కుమార్‌, అశోక్‌రెడ్డి, అధ్యాపకులు ప్రసూన దేవి, పున్నారావు, మాలే వెంకటరెడ్డి, మందడి వెంకట్‌రెడ్డి, నిర్మల, కవిత, నరసింహారావు, రాజేశ్వరి, శ్రీకాంత్‌, నగేష్‌, కరుణ, ఉమారాణి, నాగమణి, పరుశురాములు, శ్రవణ్‌, నర్సయ్య, వెంకటయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యం.. యువతకు ప్రిన్సిపాల్‌ జగదీశ్‌ పిలుపు!

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి