Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

సమాచార హక్కు చట్టంపై అవగాహనకు స్వచ్ఛంద సంస్థల కృషి కీలకం

Updated : 27 Oct 2026 08:28 IST
As Preferred Source 1 min read
సమాచార హక్కు చట్టంపై అవగాహనకు స్వచ్ఛంద సంస్థల కృషి కీలకం

కోదాడలో రక్షణ వెల్ఫేర్ సొసైటీ ప్రాజెక్ట్ ప్రారంభించిన రాష్ట్ర సమాచార కమిషనర్ విశాల్ భూపాల్

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కొమరబండ వై-జంక్షన్ వద్ద సోమవారం రక్షణ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ విశాల్ భూపాల్ రక్షణ వెల్ఫేర్ సొసైటీ ప్రాజెక్టును ప్రారంభించారు.ఈ సందర్భంగా విశాల్ భూపాల్ మాట్లాడుతూ, ప్రజలకు సమాచార హక్కు చట్టం–2005పై అవగాహన కల్పించడంలో స్వచ్ఛంద సంస్థలు కీలక పాత్ర పోషించాలని అన్నారు. చట్టంపై ప్రజలకు సరైన అవగాహన కల్పించడం ద్వారా ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సమాచార హక్కు చట్టం కార్యకర్తలు పాల్గొన్నారు. కోదాడకు విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సమాచార కమిషనర్ విశాల్ భూపాల్‌కు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన రక్షణ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకురాలు పోలంపల్లి సుజాతను పలువురు అభినందించారు.

Sthanikam

సమాచార హక్కు చట్టంపై అవగాహనకు స్వచ్ఛంద సంస్థల కృషి కీలకం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి