హైదరాబాద్: ఢిల్లీలో నిర్వహిస్తున్న బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లారు.
ఈ సందర్భంగా విమానాశ్రయంలో వారు మాట్లాడుతూ.. బ్రిక్స్ సమావేశాల వేదికపై తెలంగాణ గొంతును బలంగా వినిపిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలను సమావేశాల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
వారితో పాటు తెలంగాణ శాసనమండలి కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు, స్పీకర్ ఓఎస్డీ వెంకటేష్, మండలి చైర్మన్ ఓఎస్డీ గోవర్ధన్‌రెడ్డి తదితరులు ఢిల్లీకి బయలుదేరారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి