Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

ముకుందాపురంలో సీపీఎం ఆక్సిలరీ శాఖ ఏర్పాటు.. కార్యదర్శిగా గుర్వయ్య ఎన్నిక

Updated : 26 Oct 2026 22:42 IST
As Preferred Source 1 min read
ముకుందాపురంలో సీపీఎం ఆక్సిలరీ శాఖ ఏర్పాటు.. కార్యదర్శిగా గుర్వయ్య ఎన్నిక

మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలో సోమవారం సీపీఎం పార్టీ నూతన ఆక్సిలరీ శాఖను ఏర్పాటు చేశారు. శిరికొండ నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి సీపీఎం మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా బుర్రి శ్రీరాములు మాట్లాడుతూ, ముకుందాపురం గ్రామంలో సర్పంచ్‌గా పనిచేసిన బోళ్ల వెంకటరెడ్డి ఎర్రజెండా నాయకత్వంలో ప్రజల కోసం విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతన ఆక్సిలరీ శాఖను ఏర్పాటు చేసి, శాఖ కార్యదర్శిగా దామెర గుర్వయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు బోళ్ల కృష్ణారెడ్డి, రామసాని వెంకట్‌రెడ్డి, దసరాజు నాగరాజు, తాళ్లపాక రాములు పాల్గొన్నారు. అలాగే 14 మంది నూతన సభ్యులు సమావేశానికి హాజరయ్యారు.

Sthanikam

ముకుందాపురంలో సీపీఎం ఆక్సిలరీ శాఖ ఏర్పాటు.. కార్యదర్శిగా గుర్వయ్య ఎన్నిక

Article Image

మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలో సోమవారం సీపీఎం పార్టీ నూతన ఆక్సిలరీ శాఖను ఏర్పాటు చేశారు. శిరికొండ నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి సీపీఎం మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా బుర్రి శ్రీరాములు మాట్లాడుతూ, ముకుందాపురం గ్రామంలో సర్పంచ్‌గా పనిచేసిన బోళ్ల వెంకటరెడ్డి ఎర్రజెండా నాయకత్వంలో ప్రజల కోసం విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతన ఆక్సిలరీ శాఖను ఏర్పాటు చేసి, శాఖ కార్యదర్శిగా దామెర గుర్వయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు బోళ్ల కృష్ణారెడ్డి, రామసాని వెంకట్‌రెడ్డి, దసరాజు నాగరాజు, తాళ్లపాక రాములు పాల్గొన్నారు. అలాగే 14 మంది నూతన సభ్యులు సమావేశానికి హాజరయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి