కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో వీబీజీ రామ్జీ పథకం కింద చేపడుతున్న పనులను జిల్లా జెడ్పీ సీఈఓ శిరీష సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల నిర్వహణ తీరును, కూలీల హాజరును పరిశీలించి పలు సూచనలు చేశారు. కూలీలు విధులకు హాజరయ్యే సమయంలో పనులకు అవసరమైన పనిముట్లను వెంట తెచ్చుకోవాలని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనులు చేపట్టి పథకం లక్ష్యాలను సాధించాలని సూచించారు.
అనంతరం గ్రామంలో పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారులతో పాటు కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను సంబంధిత అధికారులతో కలిసి తనిఖీ చేశారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా చూడాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఇసాక్ హుస్సేన్, ఎంపీవో రాంబాబు, పంచాయతీ కార్యదర్శి అవినాష్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మందుల నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి