Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

బాలల భద్రతే లక్ష్యం.. పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన

Updated : 26 Oct 2026 22:42 IST
As Preferred Source 1 min read
బాలల భద్రతే లక్ష్యం.. పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన

పిల్లలపై జరిగే లైంగిక నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కోదాడ సీనియర్ సివిల్ జడ్జి కే. సురేష్ సూచించారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు సోమవారం కోదాడ అశోక్‌నగర్‌లోని కే.టి.ఎస్. టాలెంట్ స్కూల్‌లో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా జడ్జి సురేష్ మాట్లాడుతూ విద్యార్థులు మంచి స్పర్శ, చెడు స్పర్శపై అవగాహన కలిగి ఉండాలని, ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. పిల్లలకు చట్టపరంగా కల్పించిన హక్కులు, రక్షణల గురించి వివరించారు.బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గట్ల నరసింహారావు మాట్లాడుతూ సోషల్ మీడియా వినియోగంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పాఠశాల ప్రిన్సిపల్ బాణాల కోటిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చిలకా రమేష్, అకడమిక్ ఇన్‌చార్జి రాజా, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, న్యాయ సేవల కమిటీ సభ్యులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బాలల భద్రతే లక్ష్యం.. పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి