పలు వార్డుల్లో ఘనంగా వార్డు సభల నిర్వహణ
నీటి వృథాను అరికడతామని ప్రజలతో ప్రతిజ్ఞ
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
కలెక్టర్ ఆదేశాల మేరకు, మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అధ్యక్షతన, కమిషనర్ వెంకటేశ్వర నాయక్ సారథ్యంలో సోమవారం పట్టణంలోని పలు వార్డుల్లో వార్డు సభలను అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.1, 2, 3 వార్డులకు సంబంధించి స్థానిక రైతు వేదికలో నిర్వహించిన సభలో కౌన్సిలర్లు కొసనం రాకేష్ రెడ్డి, లక్ష్మీ ముత్తయ్య, లావణ్య సురేందర్ రెడ్డిలతో పాటు కమిషనర్ వెంకటేశ్వర నాయక్, మేనేజర్ శ్రీధర్ రెడ్డి, పెద్ద సంఖ్యలో వార్డు ప్రజలు పాల్గొన్నారు. 7వ వార్డు సుందరయ్య కాలనీ వాటర్ ప్లాంట్ వద్ద నిర్వహించిన సభలో కౌన్సిలర్ మంజుల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే, 14, 16 వార్డులకు సంబంధించి స్థానిక పి.బి. గార్డెన్‌లో వార్డు సభను ఏర్పాటు చేశారు. ఈ సభలకు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, నాయకులు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా కమిషనర్ ఎన్. వెంకటేశ్వర నాయక్ మాట్లాడుతూ.. రాబోయే ఎల్ నినో ప్రభావం వల్ల ఏర్పడే విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా తాగునీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వృథా చేయకూడదని, అవసరానికి తగినట్లుగా మాత్రమే వాడుకోవాలని సూచించారు. అనంతరం నీటి వృథాను అరికడతామని, నీటి సంరక్షణకు కృషి చేస్తామని సభకు హాజరైన ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, ఆర్‌ఓ అంజయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, వివిధ వార్డుల వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి