Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

అర్హులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి

Updated : 26 Oct 2026 22:42 IST
As Preferred Source 1 min read
అర్హులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి

త్వరలో జరగబోయే నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టాబద్రుల‌ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా, కోదాడ పట్టణంలోని శ్రీ సాయి వికాస్ డిగ్రీ, తేజ ఫార్మసీ లలో 2023 వరకు,డిగ్రీ మరియు డిగ్రీకి సమానమైన ఇతర కోర్సుల్లో ఉత్తీర్ణులై, ఎమ్మెల్సీ ఓటు నమోదుకు అర్హత సాధించిన కళాశాల పూర్వ విద్యార్థుల సౌకర్యార్థం, కళాశాల ప్రాంగణంలోఏర్పాటుచేసిన ఓటు నమోదు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాసర్ల కోటేశ్వరరావు, ఎమ్మెస్ విద్యాసంస్థల చైర్మన్ పందిరి నాగిరెడ్డి కోరారు. ఎమ్మెల్సీ ఓటునమోదు పై ఎమ్మెస్ కళాశాలల చైర్మన్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పందిరి నాగిరెడ్డి ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక కరపత్రాన్ని, సోమవారం మండల కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వారు కళాశాల సీఈఓ ఎస్ఎస్ రావు, మండల కాంగ్రెస్ పార్టీమాజీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పుల జానకి రెడ్డి, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు శ్రీ పాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కొమ్ము ఈదారావ్, జిల్లేపల్లి వెంకటేశ్వర్లు తదితరులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెస్ విద్యా సంస్థలు చైర్మన్ పందిరి నాగిరెడ్డి మాట్లాడుతూ, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు అర్హత సాధించిన తమ కళాశాల పూర్వ విద్యార్థులు కళాశాలలోని ప్రత్యేక ఓటర్ నమోదు కేంద్రాల్లో సంప్రదించి, తమ ధ్రువపత్రాలను అందజేసి ఓటు హక్కు పొందే అవకాశం ఉన్నదని ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు, అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఓటు అర్హత ఉన్న ప్రతి పట్టబద్రుడు తమ కళాశాల ప్రత్యేక ఓటర్ నమోదు కేంద్రంలో తమ వివరాలను అందించి ఓటు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు ఆయన తెలిపారు. ఇట్టి అవకాశాన్ని విద్యావంతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.

Sthanikam

అర్హులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి