మణుగూరులో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ కండక్టర్ ప్రవళికపై దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కోదాడ ఆర్టీసీ డిపో ఎదుట ఎస్ఈడబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తూ నినాదాలు చేశారు.విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ కార్మికులపై దాడులు జరగడం ఆందోళనకరమని వారు పేర్కొన్నారు. ప్రజలకు సేవలందించే కార్మికులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. విధులు నిర్వహించే సమయంలో కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రభుత్వం తగిన భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు.ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ, విధి నిర్వహణలో వారికి పూర్తి రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా నిరసనకారులు డిమాండ్ చేశారు.
ఆర్టీసీ కండక్టర్‌పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి