సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల గ్రామ శివారులో జాతీయ రహదారిపై సోమవారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు గాయపడ్డారు.మోతే మండలానికి చెందిన ఓ వ్యక్తి తన కుమారుడిని గురుకుల పాఠశాలలో దించేందుకు ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆకుపాముల సమీపంలో రోడ్డు దాటుతున్న సమయంలో కోదాడ నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న మరో ద్విచక్ర వాహనం వారిని ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులకు గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జాతీయ రహదారిపై ప్రమాదం.. గాయపడిన తండ్రీకొడుకులు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి