బీజేపీ రాష్ట్ర కార్యదర్శి తుటపల్లి రవికుమార్ పిలుపు.
చిట్యాల: రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులంతా ఓటు నమోదు చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి తుటపల్లి రవికుమార్ పిలుపునిచ్చారు. చిట్యాల పట్టణ బీజేపీ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ప్రైవేటు ఉపాధ్యాయులను కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన రవికుమార్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మైల నరసింహ, మండల అధ్యక్షుడు పీకే వెంకన్న, కృష్ణవేణి స్కూల్ డైరెక్టర్ కన్నబోయిన శ్రీధర్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గంజి గోవర్ధన్, బీజేపీ సీనియర్ నాయకులు గోషిక వెంకటేశం, కంచర్ల శంకర్ రెడ్డి, విడుదల మల్లేష్, బీజేవైఎం చిట్యాల పట్టణ అధ్యక్షుడు వైరాల రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి