ఇళ్ల నుంచి బయటకు వస్తే కాళ్లకు అంటుకుంటున్న నల్లటి బూడిద.
చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల పురపాలిక పరిధిలో ఎంపీఎల్ పరిశ్రమ కాలుష్యంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రాత్రి నల్లటి బూడిద పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇళ్ల నుంచి బయటకు అడుగు పెడితే కాళ్లకు నల్లటి బూడిద అంటుకుంటోందని వాపోతున్నారు.
పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో పరిసరాలు కలుషితమవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని కోరుతున్నారు. నల్లటి బూడిదకు కారణాలను గుర్తించి, కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి