ఖాతాదారుడి నామినీకి రూ 1 లక్ష బీమా పరిహారం అందజేత
పండుగల సీజన్లో సైబర్ నేరగాళ్లు రకరకాల ఆన్లైన్ ఆఫర్లు, డిజిటల్ పేమెంట్ల పేరిట మోసాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ఖాతాదారులు జాగ్రత్తగా ఉండాలని చౌటుప్పల్ పోచంపల్లి అర్బన్ బ్యాంక్ మేనేజర్ కడవేరు రాజు పేర్కొన్నారు. చౌటుప్పల్ బ్రాంచ్ ఆవరణలో ‘పండుగల వేళ సైబర్ భద్రత’ అనే అంశంపై ఖాతాదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆన్లైన్ డబ్బుల విషయంలో ఏమాత్రం మోసపోయినా తక్షణమే సైబర్ హెల్ప్లైన్ నంబర్ 1930కి సమాచారం ఇవ్వాలని లేదా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.అనంతరం, ప్రమాదవశాత్తు మృతిచెందిన బ్యాంక్ ఖాతాదారుడు ముద్దాంగుల మధు నామినీకి రూ. 1,00,000 ప్రమాద బీమా చెక్కును అందజేశారు. ఈ సమావేశంలో బ్యాంక్ సిబ్బంది, స్థానిక ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి