Sthanikam - Truth Matters
Logo

సాహసంతో ఎంజీయు విద్యార్థుల ముందడుగు..

Updated : 21 Nov 2026 18:22 IST
As Preferred Source 1 min read
సాహసంతో ఎంజీయు విద్యార్థుల ముందడుగు..

ధర్మశాల అడ్వెంచర్‌ క్యాంపులో చురుగ్గా ఎంజీయూ విద్యార్థులు

నాలుగో రోజు 20 కిలోమీటర్ల పాదయాత్ర..

సాహసంతో పాటు ఆపద సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించే నైపుణ్యాలను అలవర్చుకుంటున్నారు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ విద్యార్థులు. హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరుగుతున్న అడ్వెంచర్‌ క్యాంపులో భాగంగా నాలుగో రోజు శనివారం 20 కిలోమీటర్ల దూరంలోని నడ్డి నది వరకు పాదయాత్రగా వెళ్లారు. అక్కడ శిక్షకుల పర్యవేక్షణలో నదిని దాటే పద్ధతులు, స్వీయరక్షణ మెళకువలను నేర్చుకున్నారు.

వరదలు, ఆకస్మిక వరదలు, భారీ వర్షాల సమయంలో ఎదురయ్యే ప్రమాదాలు, ఆయా పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను శిక్షకులు వివరించారు. ప్రమాద సమయంలో తమను తాము రక్షించుకోవడంతో పాటు ఇతరులకు సురక్షితంగా సహాయం అందించే అంశాలపై అవగాహన కల్పించారు. నదిని దాటే సమయంలో పాటించాల్సిన భద్రతా పద్ధతులను తెలియజేశారు.

ఈ శిక్షణలో ఎంజీయూ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, తమకు అప్పగించిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తిచేశారు. పరస్పర సహకారం, బృందస్ఫూర్తితో ముందుకు సాగారు. ఇదే ఉత్సాహంతో క్యాంపులోని మిగతా కార్యక్రమాల్లోనూ పాల్గొంటామని తెలిపారు.

విశ్వవిద్యాలయ ఎన్‌ఎస్‌ఎస్‌ సమన్వయకర్త డాక్టర్‌ వెంకటరమణ రెడ్డి ఫోన్‌లో విద్యార్థుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. భద్రతకు ప్రాధాన్యమిస్తూ, అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని విశ్వవిద్యాలయానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ అడ్వెంచర్‌ క్యాంపు కాంటింజెంట్‌ లీడర్‌ కనక బాలరాజు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

సాహసంతో ఎంజీయు విద్యార్థుల ముందడుగు..

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి